శని గ్రహ శాంతి స్తొత్రమ్‌ – Shani Graha Shanti Stotram in Telugu | Hindi

What is Shani Graha Shanti Stotram?

Shani Graha Shanti Stotram is a devotional hymn to Lord Saturn, the planet associated with challenges and obstacles. Chanting this hymn is believed to appease Saturn’s harsh effects and bring calmness to stormy times. It reduces negativity and eases challenges in your path, Attracts prosperity, success, and positive energy , Alleviates ailments and promotes physical and mental well-being, Calms anxieties, strengthens resilience, and brings serenity to your soul.

శనైశ్చరాయ శాంతాయ సర్వాభిష్ట ప్రదాయినే |
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమ: || 1 ||

సౌ‍మ్యాయ సురవంద్యాయ సురలోక విహారిణే |
సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమ: || 2 ||

ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే |
ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమ: || 3 ||

మందాయ మందచేష్టాయ మహనీయ గుణాత్మనే |
మర్త్యపావన పాదాయ మహేశాయ నమో నమ: || 4 ||

ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే |
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమ: || 5 ||

నీలవర్ణాయ నిత్యాయ నీలాంజన నిభాయచ |
నీలాంబర విభూషాయ నిశ్చలాయ నమో నమ: || 6 ||

వేద్యాయ విధిరూపాయ విరోధాధార భూమయే |
వేదాస్పద స్వభావాయ వజ్రదేహాయ తే నమ: || 7 ||

వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ |
విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమ: || 8 ||

గృధ్రవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే |
కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమ: || 9 ||

అవిద్యామూలనాశాయ విద్యావిద్యా స్వరూపిణే |
ఆయుష్యకారణాయాపద్ధర్త్రే తస్మై నమో నమ: || 10 ||

విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే |
విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయతే నమ: || 11 ||

వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ |
వరదాభయహస్తాయ వామనాయ నమో నమ: || 12 ||

జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయామిత భాషిణే |
కష్టౌఘనాశకర్యాయ పుష్టిదాయ నమో నమ: || 13 ||

స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తవశ్యాయ భానవే |
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమ: || 14 ||

ధనుర్మండల సంస్థాయ ధనదాయ ధనుష్మతే |
తనుప్రకాశ దేహాయ తామసాయ నమో నమ: || 15 ||

ఆశేషధనివంద్యాయ విశేష ఫలదాయినే |
వశీకృత జనేశాయ పశూనామ్‌ పతయే నమ: || 16 ||

ఖేచరాయ ఖగేశాయ ఘన నీలాంబరాయ చ |
కాఠిణ్యమానసాయార్య గుణస్తుత్యాయ తే నమ: || 17 ||

నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే |
నిరామయాయనింద్యాయ వందనీయాయ తే నమ: || 18 ||

ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ |
దైన్యనాశకరాయార్య జనగణ్యాయ తే నమ: || 19 ||

క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధ ధరాయ చ |
కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమో నమ: || 20 ||

పరిపోషిత భక్తాయ పరభీతి హరాయ చ |
భక్తసంఘ మనోఽభీష్ట ఫలదాయ నమో నమ: || 21 ||

|| ఇతి శ్రీ శనైశ్చరాష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ ||

Download శని గ్రహ శాంతి స్తొత్రమ్‌ – Shani Graha Shanti Stotram in Telugu | Hindi

TeluguStotram.com

Leave a Comment